Jasprit Bumrah: బీసీసీఐ తుది నిర్ణయం నేడే.. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాడా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో బుమ్రా అందుబాటులో ఉంటాడా అన్నది బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఆస్ట్రేలియా పర్యటన చివర్లో వెన్నునొప్పి సమస్యతో ఇబ్బంది పడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.
అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని వచ్చిన వార్తలు నిజం కాలేదు.
ప్రస్తుతం అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రికవరీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేయడానికి గడువు మంగళవారంతో ముగుస్తుంది.
Details
వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా
అందుకే బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒకవేళ బుమ్రాను తప్పిస్తే పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే అవకాశముంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం, టోర్నీ మొదలైన తర్వాత బుమ్రాను జట్టులో కొనసాగించాలని అనుకుంటే అతను పూర్తిగా అందుబాటులోకి రావాల్సి ఉంటుంది.
చివరి దశలో అయినా అతడు సిద్ధమైతే భారత జట్టు యాజమాన్యం అతడిని ఆడించే అవకాశం పరిశీలిస్తోంది.
కానీ టోర్నీ మొత్తానికి దూరమైతే భారత ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
బుమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీలో అందుబాటులోకి తీసుకురావడానికి NCA బృందం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జనవరి 3-5 మధ్య జరిగిన ఆస్ట్రేలియా చివరి టెస్టులో బుమ్రా వెన్నుగాయంతో బాధపడ్డాడు.
Details
బుమ్రా కోసం ప్రత్యేక బృందం ప్రయత్నాలు
ఫలితంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే బౌలింగ్‌ను నిలిపివేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా బౌలింగ్ చేయలేకపోవడంతో భారత జట్టు ఓటమి పాలైంది.
ఈ గాయానికి చికిత్స పొందేందుకు బుమ్రా NCAకి వెళ్లగా, అక్కడ నలుగురైదుగురు నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం అతని రికవరీపై పనిచేస్తోంది.
ఇందులో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియో, వైద్యులు, సహాయ సిబ్బంది బుమ్రాను పూర్తిగా ఫిట్‌గా మార్చేందుకు శ్రమిస్తున్నారు.
బీసీసీఐ, జట్టు యాజమాన్యం బుమ్రా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
మంగళవారం చివరి పరీక్ష అనంతరం వైద్య బృందం బీసీసీఐకి నివేదిక అందించనుంది. మరి ఆ నివేదిక ఏం చెబుతుందో వేచి చూడాలి!