రిషబ్ పంత్ కి ఫుల్ సాలరీ ఇస్తూ ప్రకటన
రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. తాజాగా పంత్ విషయంలో బీసీసీఐ పెద్ద మనసు చాటుకుంది. ఇప్పటికే పంత్ ఆరోగ్య విషయంలో బీసీసీఐ ప్రత్యేక చొరవ చూపుతోంది. మెరుగైన వైద్యం కోసం ముంబాయికి ఎయిర్ అంబులెన్స్ పెట్టి.. బీసీసీఐ తరలించిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్లో మ్యాచ్ లు ఆడకున్నా.. పంత్ కు పూర్తి జీతం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దాదాపు దూరమైనట్లే చెప్పాలి. ఐపీఎల్-2023 ఆడకపోయినా మొత్తం చెల్లాంచాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది
రూ.16 కోట్లు చెల్లింపు
బీసీసీఐ కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ 1 కేటగిరిలో రిషబ్ పంత్ ఉన్నాడు. దీంతో ప్రతి ఏటా రూ.5 కోట్లు పంత్ కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ డబ్బులను చెల్లిస్తామని బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిట్స్ ఆటగాడిగా పంత్ కు రావాల్సిన రూ.16 కోట్లు చెల్లించాలని జట్టుకు అందించాలని ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. దీంతో బోర్డు కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లందరికీ బీమా ఉండనుంది. పంత్‌కు ఏడాది మొత్తానికి రూ.16 కోట్లు అందనుంది.