LOADING...
Brett Lee: జడేజా ఫిట్‌నెస్‌పై బ్రెట్ లీ ప్రశంసలు.. . కానీ ఆ విషయంలో ఆందోళన! 
జడేజా ఫిట్‌నెస్‌పై బ్రెట్ లీ ప్రశంసలు.. . కానీ ఆ విషయంలో ఆందోళన!

Brett Lee: జడేజా ఫిట్‌నెస్‌పై బ్రెట్ లీ ప్రశంసలు.. . కానీ ఆ విషయంలో ఆందోళన! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లు, ముఖ్యంగా బౌలర్లు గాయాలతో ఇబ్బంది పడటం సాధారణమే. కానీ కొందరు మాత్రం వయసు పెరుగుతున్నా కూడా అసాధారణమైన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అందులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ముందు వరుసలో ఉంటాడు. అతడి ఫిట్‌నెస్ చూసి ఇవన్నీ ఆడుతున్నా గాయపడడే లేదని ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో జడేజా చేసిన అద్భుత ప్రదర్శనపై ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్‌ లీ (Brett Lee) ప్రత్యేక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను సమం చేసింది. ముఖ్యంగా మాంచెస్టర్ టెస్టులో అజేయ శతకంతో జట్టును కాపాడిన జడేజా.. మొత్తం పర్యటనలో ఐదు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు.

Details

గొప్ప ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు

ప్రతిసారి అర్ధ శతకం పూర్తి చేసినప్పుడు తన స్టయిల్ మార్క్‌ "కత్తిసాము" (Sword Celebration) విన్యాసం చేసి అభిమానులను అలరించాడు. అయితే ఈ సెలబ్రేషన్ వల్లే గాయపడే అవకాశం ఉందని బ్రెట్ లీ సరదాగా అన్నాడు. జడేజా ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. నేను చూసిన గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడు. కానీ ఒకే ఒక్క కారణం వల్ల అతడు గాయపడే అవకాశముంది. అదేంటంటే.. అతడి సెలబ్రేషన్ స్టయిల్. ప్రతిసారి హాఫ్ సెంచరీ లేదా సెంచరీ సాధించినప్పుడు బ్యాట్‌ను కత్తిలా తిప్పుతాడు. అలాంటి కదలికల వల్ల రొటేటరీ కఫ్ ఇంజరీ (Rotator Cuff Injury) వచ్చే అవకాశం ఉందని లీ జోక్ చేశాడు.

Details

వంద టెస్టులను పూర్తి చేయాలి

అంతేకాదు, జడేజా 100 టెస్టులు పూర్తి చేయాలని తన కోరికను వెల్లడించాడు. ప్రస్తుతం అతడి వయసు 36. అయినప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. కనీసం మరో రెండేళ్లు ఎటువంటి సమస్య లేకుండా ఆడగలడు. ఆ సమయంలో మరో 15 టెస్టులు ఆడితే, వంద టెస్టుల మైలురాయిని అందుకుంటాడని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో జడేజా బ్యాటింగ్ సగటు 86గా, మొత్తం 516 పరుగులు చేశాడు. అదేవిధంగా బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా బ్యాట్, బంతి రెండింటిలోనూ తన ప్రావీణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.