Yuzvendra Chahal: చాహల్ స్పిన్ మాయజాలం.. ఒకే మ్యాచులో ఐదు వికెట్లు
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో చెలరేగుతున్నాడు. నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు (5/45) తీసి ప్రత్యర్థులను కట్టడి చేశాడు. గత నెల కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ యుజీ ఐదు వికెట్ల (5/14)తో సత్తా చాటిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్‌షైర్ జట్టు 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రత్యర్థి డెర్బీషైర్ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత చాహల్ తన స్పిన్ మాయజాలంతో ఐదు వికెట్లు తీసి వారిని 165 పరుగులకే కట్టడి చేశాడు. కౌంటీ క్రికెట్‌లో చాహల్ వరుసగా రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం.