LOADING...
T20 World Cup: వరుస ఓటములకు చెక్.. ఆఫ్ఘన్ ఖాతాలో తొలి విజయం
వరుస ఓటములకు చెక్.. ఆఫ్ఘన్ ఖాతాలో తొలి విజయం

T20 World Cup: వరుస ఓటములకు చెక్.. ఆఫ్ఘన్ ఖాతాలో తొలి విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న అప్ఘానిస్థాన్ ఎట్టకేలకు విజయ ఖాతా తెరిచింది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో యూఏఈపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల చేతిలో ఓడిన తర్వాత ఈ గెలుపుతో ఆఫ్ఘన్ జట్టు టోర్నీలో తన తొలి పాయింట్లు నమోదు చేసుకుంది. యూఏఈ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 53 పరుగులతో అర్ధశతకం సాధించి బలమైన పునాది వేశాడు.

Details

నాలుగు వికెట్లతో చెలరేగిన ఒమర్జాయ్

దర్విష్ రసూలి 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 బంతుల్లో 40 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ యూఏఈని కట్టడి చేసింది. యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. సోహైల్ ఖాన్ 68 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఒమర్జాయ్ కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని వేగవంతం చేశాడు. ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు సాధించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన ఒమర్జాయ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

Advertisement