Page Loader
US Open semis: ఆండ్రీ రెబ్లెవ్‌ను మట్టికరిపించిన డానియల్ మెద్వెదేవ్
ఆండ్రీ రెబ్లెవ్‌ను మట్టికరిపించిన డానియల్ మెద్వెదేవ్

US Open semis: ఆండ్రీ రెబ్లెవ్‌ను మట్టికరిపించిన డానియల్ మెద్వెదేవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2023
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

యూఎస్ ఓపెన్‌లో రష్యన్ స్టార్ ఆటగాడు డానియన్ మెద్వెదేవ్ అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. వరుస సెట్లలో ఆండ్రీ రెబ్లవ్ ను డానియల్ మెద్వెదేవ్ చిత్తు చేశాడు. ఈ పోటీలో అండ్రీ రెబ్లెవ్‌పై 6-4, 6-3, 6-4 తేడాతో మెద్వెదేవ్ విజయం సాధించాడు. ఒక్కసారి రన్నరప్‌గా నిలిచి విజేతగా నిలిచిన మెద్వెదేవ్ యూఎస్ ఓపెన్‌లో సత్తా చాటి నాలుగో సారి సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఏడో గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుడిగా నిలిచాడు. ఈ ఏడాది మెద్వెదేవ్‌ 54-11 గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు.

Details

అద్భుత ఫామ్ లో డానియల్ మెద్వెదేవ్ 

2023లో మెద్వెదేవ్ ఐదు గౌరవాలతో 54-11 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉన్నాడు. ఈ ఏడాది స్లామ్స్‌లో అతని గెలుపు-ఓటమి రికార్డు 14-3గా ఉంది. అంతకు ముందు వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మెద్వెదేవ్ స్లామ్స్‌లో 69-24తో, యుఎస్ ఓపెన్‌లో 28-5తో గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు. ఈ మ్యాచులో మెద్వెదేవ్ మొదటి సర్వ్‌లో 73శాతం, రెండో సర్వేలో 36శాతం విజయాన్ని సాధించాడు. అతను 9/19 బ్రేక్ పాయింట్లను మార్చాడు. మెద్వెదేవ్ 8 ఎస్‌లు సాధించగా, రుబ్లెవ్ నాలుగు ఎస్ లను సాధించాడు.