దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.
ముంబయి ఇండియన్స్ జట్టుకు 208పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు నిర్దేశించింది.
శుభ్‌మన్ గిల్ 56(34)పరుగులతో దూకుడిగా ఆడి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో గిల్‌కి ఇది మూడో అర్ధశతకం కావడం గమనార్హం.
మొదట టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా గుజరాత్ నుంచి తాము బెస్ట్ ఫినిషర్స్ అని మరోసారి నిరూపించారు. వారిద్ధరి విజృంభణతో గుజరాత్ జట్టు చివరి నాలుగు ఓవర్లలో 70పరుగులతో సత్తా చాటింది.
ఐపీఎల్
మహ్మద్ షమీకి ఇది 100వ మ్యాచ్, వృద్ధమాన్ సాహాకు 150మ్యాచ్
తొలుత వృద్ధిమాన్ సాహాను 4పరుగుల వద్ద అర్జున్ టెండూల్కర్ మూడో ఓవర్లో అవుట్ చేసి గుజరాత్‌ను ఆదిలోనే దెబ్బతీశాడు.
అయినా శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి జట్టు స్కోరును పరుగులెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్ త్వరగానే పెవిలియన్‌కు చేరారు.
అనంతరం వచ్చిన డేవిడ్ మిల్లర్(46), అభినవ్ మనోహర్(42), రాహుల్ తెవాటియా(5బంతుల్లో 20పరుగులు) ముంబయి ఆటగాళ్లపై విరుచుకు పడ్డారు.
గుజరాత్ పేసర్ మహ్మద్ షమీకి ఇది 100వ మ్యాచ్ కాగా, వృద్ధమాన్ సాహాకు ఇది 150మ్యాచ్ కావడం గమనార్హం.