
DC vs RCB : ఐపీఎల్ 18లో దిల్లీ జైత్రయాత్ర.. ఆర్సీబీపై ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 (సీజన్ 18)లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో దిల్లీ వరుసగా నాలుగో గెలుపు అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (37; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (22; 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా ఆరంభం ఇచ్చారు. అనంతరం రజత్ పటీదార్ (25), కృనాల్ పాండ్య (18) కొంత స్థిరతనిచ్చారు.
Details
కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన
చివర్లో టిమ్ డేవిడ్ (37 నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. దిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీసారు.
163 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు కొంత వేగంగా ఆడినప్పటికీ, అసలు అద్భుతం చూపించింది.
కెఎల్ రాహుల్. ఆయన 53 బంతుల్లో 93 పరుగులు (7 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో నాటౌట్‌గా నిలిచాడు.
Details
రెండు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీసాడు, యశ్ దయాల్, సుయాశ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో దిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో మరింత పటిష్ట స్థితిలోకి వెళ్లింది.
కెఎల్ రాహుల్, స్టబ్స్ దూకుడుగా ఆడి జట్టును గెలుపు దాకా చేర్చారు. బౌలింగ్‌లో కుల్దీప్, విప్రాజ్ నిగమ్ మంచి ప్రదర్శన చేశారు.
మొత్తంగా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సమతూకంగా రాణించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.