Page Loader
సాకేత్-యూకీ జోడి పోరాడినా ఓటమి తప్పలేదు
తొలి రౌండలోనే నిష్ర్కమించిన సాకేత్-యూకే జోడి

సాకేత్-యూకీ జోడి పోరాడినా ఓటమి తప్పలేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాకేత్ మైనేని, యూకీ బంబ్రీ నిరాశపరిచారు. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి, పరాజయం పాలయ్యారు. అమెరికాలోని హ్యుస్టన్‌లో ఈ టోర్ని జరుగుతోంది. తొలి రౌండ్‌లో సాకేత్‌-యూకీ ద్వయం 6-7 (6/8), 6-2, 5-10తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో రాబర్ట్‌ గాలోవే (అమెరికా)-మిగేల్‌ ఎంజెల్‌ రేయస్‌ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో చిత్తు అయ్యారు. భారత్ డబుల్స్ జోడీ పోరాడినా ఓటమి తప్పలేదు.

టెన్నిస్

సాకేత్, యూకీలకు ప్రైజ్‌మనీ

గంటా 40 నిమిషాల పాటు ఈ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఇందులో సాకేత్, యూకీ జోడి మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేయడం గమనార్హం. అయితే సూపర్ టైబ్రేక్‌లో మాత్రం సత్తా చాటలేకపోయారు. గాలోవే-వరేలా ద్వయం పైచేయి సాధించడంతో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాల్సి వచ్చింది. సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.