సానియా చాలామందికి స్పూర్తినిచ్చిందన్న ప్రధాని మోదీ
భారత్ మహిళ టెన్నిస్ కు వెలునిచ్చిన సానియా మీర్జా ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించింది. గడిచిన దశాబ్దన్నర కాలంగా భారత టెన్నిస్‌కి ఎనలేని సేవలను హైదరాబాద్ స్టార్ సానియా మీర్జా చేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో శాశ్వితంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూర్ జట్టుకు ఆమె మెంటార్ గా వ్యవవహరిస్తోంది. తాజాగా భారత్ టెన్నిస్ కు అమె చేసిన సేవలను కొనియాడుతూ ప్రధాని మోదీ బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖను స్వయంగా సానియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.
ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన సానియా మీర్జా
ఇక సానియా టెన్నిస్ ఆడవన్న విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు ఏదో కోల్పోతున్నారని, తన కెరీర్‌లో ఇండియాలోనే బెస్ట్ టెన్నిస్ ప్లేయర్‌గా ఎదిగిందని, రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తినిచ్చావని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు. తాను భారత్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని ఎప్పుడూ గౌరవంగానే భావిస్తానని, ప్రతిసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించానని, భవిష్యతులో కూడా అదే అంకితభావంతో పనిచేస్తానని, ప్రధాని మోదీ మద్దతకు కృతజ్ఞతలు అని సానియా పేర్కొంది.