Page Loader
ఓటమితో టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై
సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడింది

ఓటమితో టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన 20 ఏళ్ల కెరీర్‌కి గుడ్‌బై చెప్పింది. చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆటకు పుల్‌స్టాప్ పెట్టింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లోనే భారత్‌కి చెందిన సానియా, అమెరికాకి చెందిన మాడిసన్‌ కీస్‌ జోడీ ఓటమిని చవిచూసింది. తొలి సెట్‌లో 4-6, 0-6తో రష్యాకు చెందిన వెరోనికా, లియుడ్‌ మిలా సమ్‌స నొవా చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్‌లో ఒక దశలో 4-4తో చక్కటి ప్రదర్శన కనబర్చిన సానియా జోడీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది రెండో సెట్ సానియా జోడి పూర్తిగా నిరాశ పరిచింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆ సెట్ లో వరుసగా ఆరు పాయింట్లను రష్యా జోడి దక్కించుకొని విజయం సాధించింది.

సానియా

2003లో టెన్నిస్ అడుగు పెట్టిన సానియా

2003లో టెన్నిస్ అడుగు పెట్టిన సానియా తన కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలిచి, మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్‌ను గెలుచుకుంది. 2004లో అర్జున, 2015లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న , 2004లో అర్జున, 2015లో మేజర్ ధ్యాన్ చంద్, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను గెలుచుకుంది. రెండు దశాబ్దాలపాటు కెరీర్‌ కొనసాగించిన సానియా భారతదేశపు అత్యంత విజయవంతమైన మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు పొందడం విశేషం