మాజీ ప్రియురాలిపై ఆసీస్ టెన్నిస్ స్టార్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ప్రియురాలిపై టెన్నిస్ స్టార్ ఆటగాడు నిక్ కిర్గియోస్ దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణం వల్లే దాడికి పాల్పడినట్లు కిర్గియోస్ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో నేరారోపణ నుండి కెర్గియోస్ తప్పించుకున్నాడు.
జనవరి 10, 2021న తన కారును డ్రైవింగ్ చేయకుండా కెర్గియస్ మాజీ ప్రియురాలైన పసారి ఆపింది. దీంతో కోపంతో కిర్గియోస్ ఆమెను నేలపై నెట్టి దాడి చేశాడని అప్పట్లో కేసు నమోదైంది.
తీర్పు తర్వాత మిస్టర్ కిర్గియోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. నేరారోపణలు లేకుండా ఆరోపణలను కొట్టివేసినందుకు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
కిర్గియోస్
నేరం జరిగినట్లు ఒప్పుకున్న కిర్గియోస్
కిర్గియోస్ తరుపు న్యాయవాది మైఖేల్ కుకులీస్-స్మిత్ వాదిస్తూ సమస్యను తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ సమయంలో నిరాశతో కిర్గియోస్ అలా ప్రవర్తించాడని, నేరం జరిగినట్లు తన క్లెయింట్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగినప్పుడు తాను మంచి స్థానంలో లేనని, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని పేర్కొన్నారు. తాను కలిగించిన బాధకు హృదయపూర్వకంగా చింతిస్తున్నానని కిర్గియోస్ వెల్లడించారు.
ప్రస్తుతం కిర్గియోస్ తన మొదటి గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో పోటీ పడనున్నారు.