Page Loader
జొకోవిచ్, నాదల్ సాధించిన రికార్డులివే
నాదల్‌పై జకోవిచ్ 30-29 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉన్నాడు

జొకోవిచ్, నాదల్ సాధించిన రికార్డులివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2023
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

జొకోవిచ్, నాదల్ ఇద్దరూ గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళు, ఇద్దరి పేరుమీద మెరుగైన రికార్డులున్నాయి. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో తన కెరీర్‌లో వరుసగా 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిట్ ను గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్ (22) అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ల పరంగా రాఫెల్ నాదల్‌ను రికార్డును సమం చేశాడు. ఈ జంట చివరిసారిగా 2022 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్-ఫైనల్స్‌లో తలపడింది. 'బిగ్ టైటిల్' అనేది గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌షిప్, ATP ఫైనల్స్, ఒలింపిక్ సింగిల్స్ గోల్డ్ మెడల్‌లతో కూడిన ట్రోఫీ. జకోవిచ్ ఇందులో 66 సంపాదించగా.. నాదల్ 59 మాత్రమే సాధించాడు.

జాకోవిచ్

వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నజాకోవిచ్

10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు, రెండు ఫ్రెంచ్ ఓపెన్‌లు, ఏడు వింబుల్డన్ టైటిల్స్, మూడు US ఓపెన్ ట్రోఫీలతో సహా 22 గ్రాండ్ స్లామ్‌లను జొకోవిచ్ గెలుచుకున్నాడు. నాదల్ 14 ఫ్రెంచ్ ఓపెన్స్, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు, నాలుగు US ఓపెన్‌లు, రెండు వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. చివరిసారిగా 2022 రోలాండ్ గారోస్‌లో మేజర్‌ను గెలుచుకున్నాడు. నాదల్ తర్వాత ఒకే ATP టోర్నమెంట్‌లో తన మొదటి 10 ఫైనల్స్‌లో అజేయంగా నిలిచి జకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 విజయంతో జకోవిచ్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు