Page Loader
Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్
66వ బిగ్ టైటిల్‌ను గెలుచుకున్న జకోవిచ్

Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 30, 2023
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో నోవాక్ జకోవిచ్ 6-3, 7-6(7/4), 7-6(7/5) తేడాతో గ్రీక్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. తన కెరీర్ లో వరుసగా 10వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ ను జకోవిచ్ గెలుచుకొని సత్తా చాటాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నాధల్ రికార్డును జకోవిచ్ సమం చేశాడు. జకోవిచ్ ప్రస్తుతం బిగ్ టైటిల్స్ లీడర్‌బోర్డ్‌లో నాదల్, రోజర్ ఫెదరర్‌పై భారీ ఆధిక్యాన్ని సాధించడం గమనార్హం.

జకోవిచ్

వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న జకోవిచ్

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 విజయంతో జకోవిచ్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు, రెండు ఫ్రెంచ్ ఓపెన్‌లు, ఏడు వింబుల్డన్ టైటిల్స్, మూడు US ఓపెన్ ట్రోఫీలతో సహా 22 గ్రాండ్ స్లామ్‌లను జొకోవిచ్ గెలుచుకున్నాడు. ఫెదరర్ ఎనిమిది వింబుల్డన్ ట్రోఫీలు, ఒక ఫ్రెంచ్ ఓపెన్, ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్, ఐదు US ఓపెన్‌లతో సహా 20 స్లామ్‌లను గెలుచుకున్నాడు. నాదల్ 14 ఫ్రెంచ్ ఓపెన్స్, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు, నాలుగు US ఓపెన్‌లు, రెండు వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్నాడు.