ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న కిర్గియోస్
నిక్ కిర్గయోస్ ఆస్రేలియా ఓపెన్ నుండి తప్పుకున్నాడు. గాయం కారణంగా తన సొంత గ్రౌండ్ లో స్లామ్ ఆడకపోవడం చాలా దారుణమైన విషయమని కిర్గియోస్ చెప్పారు. టైటిల్ గెలవడానికి అవకాశంగా భావించిన ఈ ఆస్ట్రేలియన్ చీలిమండ సమస్య కారణంగా మొత్తం టోర్నికి దూరమయ్యాడు. మొదటి రౌండ్‌లో రష్యన్ రోమన్ సఫియులిన్‌తో తలపడటానికి ఒక రోజు ముందు మోకాలి సమస్యతో బాధపడినట్లు తెలిసింది. మెల్‌బోర్న్ పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిర్గియోస్ మాట్లాడాడు. "తాను ఇక్కడ కొన్ని గొప్ప టోర్నమెంట్‌లను ఆడానని, గతేడాది డబుల్స్‌లో కూడా విజయం సాధించానని గుర్తు చేశాడు.
గాయాలు కూడా క్రీడల్లో భాగమే
అత్యంత ముఖ్యమైన ఈ టోర్నమెంట్లో పాల్గొనకపోవడం చాలా బాధకరంగా ఉందన్నారు. గాయాలు క్రీడల్లో భాగమని, ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కిర్గియోస్ చెప్పారు. ఈ గాయం పెద్దది కాదని, దీని వల్ల కిర్గియోస్ కెరీర్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదని విల్ మహర్ చెప్పారు. కిర్గియోస్ 2022లో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. వింబుల్డన్‌లో జకోవిచ్‌తో ఓడిపోయే ముందు మొదటి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.