Page Loader
వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం
శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక

వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2023
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక భారత్ తో జరిగిన వన్డేలో శ్రీలంక తరుపున అరంగ్రేటం చేశారు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ తన T20I కెరీర్‌లో మంచి ప్రారంభాన్ని ప్రారంభించాడు. 2000 సెప్టెంబర్ 18 మధుశంక శ్రీలంకలోని హంబన్‌తోటలో జన్మించారు. పేసర్ మార్చి 2020లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో సూపర్ గా రాణించాడు. వన్డేలో అరంగేట్రం చేయడానికి ముందు ఒక లిస్ట్ A మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ పోటీలో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. మధుశంక ప్రస్తుతం ఎనిమిది ఎఫ్‌సి మ్యాచ్‌లలో 38.4 సగటుతో 29 వికెట్లు తీశాడు. 19 టీ20 మ్యాచ్‌లలో ఇప్పటివరకూ 21 వికెట్లు తీసి సత్తా చాటాడు.

శ్రీలంక

వన్డే సిరీస్‌ను సాధిస్తారా..?

గతేడాది ఆగస్టులో జరిగిన టీ20 ఆసియా కప్‌లో మధుశంక అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత పర్యటనలో భాగంగా మధుశంక మూడు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం వన్డే సిరీస్ లో శ్రీలంక బౌలింగ్‌ను ఎంచుకుంది అంతకుముందు జరిగిన T20I సిరీస్‌ను శ్రీలకం 1-2తో తేడాతో కోల్పోయింది. ప్రస్తుతం వన్డే సిరీస్ ను అయినా సాధిస్తారో వేచి చూడాలి ప్రస్తుతం టీమిండియా సీనియర్ల రాకతో పటిష్టంగా ఉంది.