LOADING...
IND vs PAK: స్లెడ్జింగ్‌ చేయొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ ముందు కెప్టెన్ సూర్య ఇచ్చిన కీలక గైడెన్స్ ఇవే!
స్లెడ్జింగ్‌ చేయొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ ముందు కెప్టెన్ సూర్య ఇచ్చిన కీలక గైడెన్స్ ఇవే!

IND vs PAK: స్లెడ్జింగ్‌ చేయొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ ముందు కెప్టెన్ సూర్య ఇచ్చిన కీలక గైడెన్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే అభిమానుల్లోనే భావోద్వేగాలు ఉప్పొంగిపోతాయి. ఇరు జట్ల ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో తమ జట్టే గెలుస్తుందని వ్యాఖ్యల యుద్ధం చేస్తుంటారు. అలాంటి హై వోల్టేజ్ పోరులో బరిలోకి దిగే ఆటగాళ్లపై ఉండే ఒత్తిడి ఎంత ఉంటుందో అంచనా వేయడం సులభం కాదు. ఇటీవల పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికే టీమ్‌ఇండియా ప్లేయర్లు నిరాకరించిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న టెన్షన్ కూడా చివరి వరకూ నెలకొంది. అయితే అన్ని అడ్డంకులు తొలగి, ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ విజయవంతంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది.

Details

114 ఆలౌట్ పాక్ ఆలౌట్

మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహచరులకు కీలక సూచనలు చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక మ్యాచ్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' మెడల్‌ను 'శివమ్ దూబె' దక్కించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. సాధారణంగా టీ20ల్లో ఇది పెద్ద స్కోరు కాకపోయినా, ప్రేమదాస మైదానంలో మాత్రం ఇది పోటీ లక్ష్యంగానే భావించాలి. ఆ తర్వాత పాకిస్థాన్‌ను కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ ఏకపక్ష విజయం సాధించింది.

Details

ఆటగాళ్లను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు

మ్యాచ్ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ జట్టు సభ్యులతో మాట్లాడుతూ, "మన లక్ష్యం నాణ్యమైన క్రికెట్ ఆడటమే. అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి గెలుపు సాధిద్దాం. మైదానంలో ఉత్సాహంగా ఉండండి. ఓవర్ల మధ్య వేగంగా పరుగులు పెట్టండి. కానీ ప్రత్యర్థి ఆటగాళ్లను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. వారు రెచ్చగొట్టినా స్పందించకండి. స్లెడ్జింగ్‌లో పడిపోకుండా, నిశ్శబ్దంగా విజయాన్ని అందుకుందామని స్పష్టం చేశాడు. సూర్య ఇచ్చిన సూచనలను కచ్చితంగా అమలు చేసిన భారత జట్టు, మైదానంలో మాటలతో కాదు... ఆటతోనే సమాధానం ఇచ్చింది.

Advertisement