
Saweety Boora: మాజీ ప్రపంచ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆమె.. ఒక మాజీ ప్రపంచ ఛాంపియన్. దేశంలో నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత.
ఆమె పేరు సావీటీ బూరా. దేశానికి ఎన్నో గౌరవాలు తెచ్చిన ఈమె ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కష్టాలను ఎదుర్కొంటోంది.
అత్తివారి నుంచి వరకట్న వేధింపులు ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
తన భర్త, అత్తింటి వారు వరకట్నం కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించారు.
దీంతో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా సహా అతని కుటుంబ సభ్యులపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
వివరాలు
కోర్టు మెట్లు ఎక్కిన వివాహ జీవితం
సావీటీ బూరా,దీపక్ హుడా 2022లో పెళ్లి చేసుకున్నారు.కానీ వివాహం తర్వాత వారి మధ్య విభేదాలు పెరిగాయి.
2024 ఫిబ్రవరి 25న హర్యానాలోని హిసార్‌లో బూరా పోలీసులకు ఫిర్యాదు చేశారు.భర్తతో పాటు అత్తింటి వారు కూడా తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
హిసార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సీమా ఈ కేసును ధృవీకరించారు.
హుడాకు 2-3 సార్లు నోటీసులు పంపినప్పటికీ,అతను హాజరుకాలేదని తెలిపారు.
గాయంతో బాధపడుతున్నాను అని చెప్పి హాజరు కాలేదని సమాచారం. మెడికల్ సర్టిఫికేట్ సమర్పించానని, తర్వాత విచారణకు వస్తానని హుడా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, తన భార్యపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆయన నిరాకరించారు. దీనిపై బూరా కూడా స్పందించలేదు
వివరాలు
క్రీడా రంగంలో మెరిసిన హుడా - రాజకీయంగా ఓటమి
దీపక్ హుడా 2016లో దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించాడు.
భారత కబడ్డీ జట్టులో ఒక ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా తన ప్రతిభను చూపించాడు.
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో, రోహ్‌తక్ జిల్లాలోని మెహం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయాడు.
గొడవలకు కారణం?
ఇద్దరి మధ్య లగ్జరీ జీవితంపై విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో ఘర్షణలు తీవ్రమయ్యాయి.
చివరికి ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.