Page Loader
ఫైనల్‌కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్
ఫైనల్‌కు చేరుకున్న రియల్ మాడ్రిడ్

ఫైనల్‌కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2023
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ కు రియల్ మాడ్రిడ్ దూసుకెళ్లాడు. ఈజిప్టుకు చెందిన ఆల్ అహ్లీని 4-1తో ఓడించి రియల్ మాడ్రిడ్ సత్తా చాటాడు. అనంతరం సౌదీ అరేబియా జట్టుకు చెందిన అల్ హిలాల్‌తో తలపడనున్నారు. రియల్ తరఫున వినిసియస్, ఫెడెరికో వాల్వెర్డే, రోడ్రిగో, సెర్గియో అర్రిబాస్ గోల్స్ చేశారు. అంతకుముందు, అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. వినిసియస్ జూనియర్ హాఫ్-టైమ్‌కు మూడు నిమిషాల ముందు తన స్కోరింగ్ ఖాతాను తెరిచాడు. ఫెడెరికో వాల్వర్డే విరామం తర్వాత మరో గోల్ చేశారు. ఎడ్వర్డో కమవింగా హుస్సేన్ ఎల్ షాహత్‌ను ట్రిప్ చేయగా.. అలీ మలౌల్ పెనాల్టీతో 2-1తో సమం చేశాడు.

అల్ అహ్లీ

మూడో స్థానంలో నిలిచిన అల్ అహ్లీ

ఆఫ్రికా కు చెందిన అల్ అహ్లీ జట్టు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన క్లబ్ లలో ఒకటిగా ఉంది. 2006, 2020, 2021లో అల్ అహ్లీ జట్టు మూడవ స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో రియల్ కోసం వినిసియస్ తన 14వ గోల్ చేశాడు. మొత్తంమీద అతను లాస్ బ్లాంకోస్ తరపున 202 మ్యాచ్‌లలో 51 గోల్స్ చేశాడు. వాల్వెర్డే 2022-23లో అన్ని పోటీల్లో రియల్ కోసం తన 9వ గోల్ చేశాడు. ఇప్పుడు 180 మ్యాచ్‌లలో 15 గోల్స్ సాధించాడు. రోడ్రిగో ఈ సీజన్‌లో తన 10వ గోల్‌ను ఛేదించాడు. రియల్ మొత్తం 19 ప్రయత్నాలు చేయగా.. 11సార్లు లక్ష్యాన్ని చేరుకున్నాడు. అల్ అహ్లీ 15 ప్రయత్నాలతో 5 సార్లు లక్ష్యం చేరుకుంది.