Page Loader
వెస్టిండీస్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన  గాబ్రియెల్
వన్డేలో చోటు సంపాదించుకున్న గాబ్రియేల్

వెస్టిండీస్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన గాబ్రియెల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2023
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వన్డే, టీ20 జట్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేలకు సారథిగా సాయ్ హోప్, టీ20లకు కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ ఆడనుంది. అయితే వన్డేలో కీలక పేసర్ రాచెల్ షానన్ గాబ్రియేల్ చోటు సంపాదించుకున్నాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత గాబ్రియెల్ వన్డేలను ఆడలేదు. గతేడాది నవంబర్‌లో సూపర్‌50 కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా గాబ్రియేల్ నిలిచాడు. దీంతో మళ్లీ వన్డేల్లో చోటు సంపాదించుకున్నాడు. జింబాబ్వేతో సిరీస్‌లో భాగంగా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి గాబ్రియేల్ అడుగు పెట్టాడు. ఇప్పటివరకూ 57 టెస్టులు, 25 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు.

వెస్టిండీస్

వన్డేలకు వెస్టిండీస్ జట్టు ఇదే

మోకాలి శస్త్రచికిత్స కారణంగా పేసర్ గాబ్రియేల్ జట్టుకు దూరమయ్యాడు. గాబ్రియేల్ 25 వన్డేల్లో 5.92 ఎకానమీ రేటుతో 33 వికెట్లు తీశాడు. గాబ్రియెల్ చివరిసారిగా 2019 ప్రపంచకప్ సందర్భంగా వన్డే ఆడాడు. జేడెన్ సీల్స్ ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం గమనార్హం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్ టీ20లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్-కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైలర్స్ , నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్.