వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర ఆల్ రౌండర్
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు కొత్త కెప్టెన్‌లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్ ఆటగాడు సాయ్ హోప్, టీ20లకు విధ్వంసకర ఆల్ రౌండర్ రోవ్‌మన్ పావెలను నియమించింది. గతేడాది T20 ప్రపంచ కప్ తర్వాత వైట్-బాల్ కెప్టెన్‌గా నికోలస్ పూరన్ తప్పుకున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్, ఐసీసీ టీ20ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నూతన కెప్టెన్‌లను వెస్టిండీస్ బోర్డు నియమించింది. వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైనందుకు గొప్ప గౌరవంగా ఉందని హోప్ వెల్లడించారు. హోప్ 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.ఇప్పటివరకూ 104 వన్డేల్లో 4,308 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలున్నాయి. ప్రస్తుతం విండీస్ తరపున అత్యధిక పరుగుల చేసిన 11వ ఆటగాడిగా నిలిచాడు.
వెస్లిండీస్ వన్డే కెప్టెన్‌గా సాయ్ హోప్
హోప్ ముఖ్యంగా ఆసియాలో 23 వన్డేలు 1,428 పరుగులు చేశాడు. 2019లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్‌లోహోప్, జాన్ కాంప్‌బెల్‌తో ఓపెనింగ్ వికెట్‌కు 365 పరుగులు జోడించాడు. ఇది ఓపెనింగ్ వికెట్‌కు అత్యధిక వన్డే భాగస్వామ్యంగా నిలిచిపోయింది. గతేడాది హోప్ తన 100వ వన్డేలో సెంచరీ కొట్టిన 10వ బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌కు నాయకత్వం వహించే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఇది తన కెరీర్‌లో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పావెల్ పేర్కొన్నారు. పావెల్ 55 టీ20 మ్యాచ్ లు ఆడి 890 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. టీ20ల్లో సెంచరీ చేసిన ముగ్గురు కరేబియన్ బ్యాటర్లలో పావెల్ ఒకడు.