సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్
జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్ శతకంతో అదరగొట్టాడు. తన కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీ చేసి సత్తా చాటాడు. బ్రాత్‌వైట్‌తో పాటు టాగెనరైన్ చందర్‌పాల్ తన తొలి టెస్టు శతకాన్నిసాధించాడు. వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి బ్రాత్‌వైట్ 246 బంతుల్లో 116* పరుగులు చేశాడు. మూడో ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 127 ఓవర్లలో 380 పరుగులు చేసింది. బ్రాత్ వైట్ 182, చంద్రపాల్ 167 పరుగులు చేశాడు. జింబాబ్వేపై బ్రాత్‌వైట్‌కు ఇది మొదటి సెంచరీ
బ్రాత్‌వైట్ సాధించిన రికార్డులివే
తొలిరోజు 51 ఓవర్లను బ్రాత్ వైట్, చంద్రపాల్ వికెట్ నష్టపోకుండా ఆడాడు. ఓపెనింగ్ భాగస్వామ్యం 200 పరుగులు చేయడం వెస్టిండీస్ కు పదోసారి. 2012లో న్యూజిలాండ్‌పై క్రిస్ గేల్, కీరన్ పావెల్‌ల 254 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రాత్‌వైట్-చంద్రపాల్ అధిగమించారు బ్రాత్‌వైట్ 2011లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. 82 మ్యాచ్‌ల్లో 5,200కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలున్నాయి. స్వదేశంలో బ్రాత్‌వైట్ 35.91 సగటుతో 7 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశాడు. మొత్తం 2,550 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 221 పరుగలను చేసింది.