Page Loader
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జింబాబ్వే సై
టెస్టులో జింబాబ్వే చేతిలో వెస్టిండీస్ ఎప్పుడూ ఓడిపోలేదు

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జింబాబ్వే సై

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 4 నుంచి జింబాబ్వేతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. జింబాబ్వే‌‌కు కీలకమైన ఆటగాళ్లు దూరం కావడంతో జట్టు బలహీనంగా కనిపిస్తోంది. క్రెయిగ్ ఎర్విన్ జింబాబ్వే టెస్టు పగ్గాలను చేపట్టనున్నారు. మరోవైపు, కరీబియన్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 23 టెస్టులు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం నాలుగు సార్లు మాత్రమే గెలిచింది. ముందుగా ఫీల్డింగ్ చేసిన జట్లు 11 సార్లు గెలిచింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్ ఫ్యాన్‌కోడ్‌లో మధ్యాహ్నం 1.30 కి ప్రత్యక్ష ప్రసారం కానుంది.

వెస్టిండీస్

ఇరు జట్లలోని సభ్యులు

టెస్టుల్లో జింబాబ్వేపై వెస్టిండీస్‌కు మంచి రికార్డు ఉంది. ఇరు జట్లు చివరిసారిగా 2017లో టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 1-0తో విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై వెస్టిండీస్ మూడు విజయాలను నమోదు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ వేలి పగుళ్ల కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. ఆల్ రౌండర్లు సికందర్ రజా, ర్యాన్ బర్ల్ కూడా అందుబాటులో లేరు. కరీబియన్ జట్టులో బ్రాత్‌వైట్‌, ఆల్‌రౌండర్లు చేజ్, హోల్డర్ రాణించే అవకాశం ఉంది. జింబాబ్వే: మిల్టన్‌శుంబా, తనునూర్వా, గ్యారీ, క్రెయిగ్ఎర్విన్ (కెప్టెన్), కైయా, తఫద్జ్వా త్సిగా (వికెట్-కీపర్), చిభాబా, మసకద్జా, డొనాల్డ్, వెస్ట్‌న్వాచ్‌రో, వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), చందర్‌పాల్, బోన్నర్, బ్లాక్‌వుడ్, మేయర్స్, రోస్టన్‌చేజ్, సిల్వా (వికెట్-కీపర్), హోల్డర్, కెమర్‌రోచ్, జోసెఫ్, గుడాకేష్ మోటీ