వెస్టిండిస్ టెస్టు జట్టులో సీనియర్ పేసర్ రీ ఎంట్రీ
జింబాబ్వేతో జరిగే రెండు టెస్టుల మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్‌గా బ్రాత్‌వైట్ ఎంపికయ్యాడు. వెటరన్ పేసర్ షానన్ గాబ్రియెల్, గుడాకేష్ మోటీ, జోమెల్ వారికన్ తిరిగి టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నారు. జింబాబ్వే టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 4న బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి. వెస్టిండిస్ చివరి టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాలో చేతిలో 2-0తో ఓడిపోయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేసిన వెస్టిండీస్ ఆటగాడు షమర్ బ్రూక్స్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఫిలిప్ కూడా అందుబాటులో లేడు. సీనియర్ పేసర్ గాబ్రియెల్ రీ ఎంట్రీతో వెస్టిండీస్ జట్టుకు బలం చేకూరనుంది.
టెస్టు సిరీస్‌కు ఎంపికైన వెస్టిండీస్ జట్టు ఇదే
నవంబర్ 2021లో వెస్టిండీస్ తరఫున చివరిసారిగా టెస్టు ఆడిన గాబ్రియెల్ తిరిగి జట్టులోకి ప్రవేశించాడు. గత ఏడాది నవంబర్‌లో ట్రినిడాడ్, టొబాగో రెడ్ ఫోర్స్ తరఫున సూపర్50 కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా పేరు సంపాదించాడు. గాబ్రియల్ అనుభవజ్ఞుడైన బౌలర్ అని 10 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ స్థాయిలో రాణించిన అనుభవం ఉందని డెస్మండ్ హేన్స్ అన్నాడు. వెస్టిండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), న్క్రుమా బోన్నర్, టాగ్నరైన్ చందర్‌పాల్, రోస్టన్ చేజ్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కైలెష్టీ, కైలేష్టీ రీఫెర్, కెమర్ రోచ్, డెవాన్ థామస్, జోమెల్ వారికన్.