
Shubman Gill: కెప్టెన్‌గా గిల్ మరో మెట్టు ఎక్కాడు.. విక్రమ్ సోలంకి ప్రశంసలు!
ఈ వార్తాకథనం ఏంటి
2025 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తమ 10 మ్యాచుల్లో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది.
యువ కెరటం శుభ్‌మన్ గిల్ (Shubman Gill) జట్టు కెప్టెన్‌గా బాగానే రాణిస్తున్నాడు. గత సీజన్ నుంచే గిల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టి, జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు.
విక్రమ్ సోలంకి ప్రశంసలు
గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి, గిల్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఒత్తిడిలోనూ సమతూకంగా వ్యవహరిస్తూ కెప్టెన్‌గా గొప్ప పరిణితిని చూపిస్తున్నాడు. కేవలం ప్రతిభావంతమైన బ్యాటర్ మాత్రమే కాదు.
అద్భుత నాయకుడిగా ఎదుగుతున్నాడు. మొదట్లో చాలా మంది అభిమానులు గిల్‌పై అనుమానంతో ఉన్నా, అతడు తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారని వివరించారు.
Details
అద్భుత ఫామ్ లో గిల్
ఐపీఎల్‌లో గత మూడు సీజన్లుగా శుభ్‌మన్ గిల్ ఫామ్‌ను నిలబెట్టుకుంటూ రన్‌ల వర్షం కురిపిస్తున్నాడు.
2023 సీజన్‌లో గిల్ 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 2024లో 12 మ్యాచుల్లో 426 పరుగులు చేశాడు.
2025 సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచుల్లోనే 465 పరుగులు సాధించి రాణిస్తున్నాడు. ఈ గణాంకాలు గిల్ ప్రస్తుతం ఫామ్‌లో ఎలా ఉన్నాడో స్పష్టంగా చూపిస్తున్నాయి.
కెప్టెన్సీ ఒత్తిడి మధ్యలోనూ, తన ఆటతీరును నిలబెట్టుకుంటూ జట్టుకు విశ్వాసాన్ని ఇచ్చే నాయకుడిగా గిల్ ఎదుగుతున్నాడు.