SA20 2027 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. SA20 ఐదో సీజన్ షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా ప్రీమియర్ టీ20 లీగ్ SA20 ఐదో సీజన్ (2027) షెడ్యూల్‌ను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా టోర్నీ 2027 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు జరగనుంది. గత సీజన్ ఫైనల్‌లో తలపడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్ల మధ్యే ఈసారి కూడా తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. జనవరి 17న ఆరంభం SA20 2027 సీజన్‌కు గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియం వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు, గత సీజన్ రన్నరప్ ప్రిటోరియా క్యాపిటల్స్తో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది.
వివరాలు
ఫిబ్రవరి 21న ఫైనల్
ఈ సీజన్ ఫైనల్ 2027 ఫిబ్రవరి 21న కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరగనుంది. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి SA20 ఫైనల్‌కు న్యూలాండ్స్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం.
లీగ్ దశ, డబుల్ హెడర్లు
లీగ్ దశ ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. మొత్తం టోర్నీని ఆరు వేదికల్లో నిర్వహించనున్నారు.
అభిమానులకు మరింత వినోదాన్ని అందించేందుకు నాలుగు శనివారాలు డబుల్ హెడర్లు షెడ్యూల్ చేశారు. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
వివరాలు
ప్లేఆఫ్ షెడ్యూల్
ఫిబ్రవరి 16, 2027 - క్వాలిఫయర్-1 (బోలాండ్ పార్క్, పార్ల్)
ఫిబ్రవరి 17, 2027 - ఎలిమినేటర్ (వాండరర్స్, జోహన్నెస్‌బర్గ్)
ఫిబ్రవరి 19, 2027 - క్వాలిఫయర్-2 (వాండరర్స్, జోహన్నెస్‌బర్గ్)
ఫిబ్రవరి 21, 2027 - ఫైనల్ (న్యూలాండ్స్, కేప్‌టౌన్
SA20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. గత సీజన్ ఫైనల్‌లో తలపడిన రెండు జట్లతోనే కొత్త సీజన్‌ను ప్రారంభించడం కంటే మంచి ఆరంభం ఉండదన్నారు.
ప్రతి కొత్త సీజన్ షెడ్యూల్ విడుదల మాకు ప్రత్యేకమైన ఘట్టం. గత ఏడాది ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ అద్భుతమైన పోరాటం చేశాయి.
అదే రెండు జట్లతో కొత్త సీజన్‌ను ప్రారంభించడం అభిమానులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
కేప్‌టౌన్ మేయర్ ఆనందం
కేప్‌టౌన్ మేయర్ జియోర్డిన్ హిల్-లూయిస్ కూడా మరోసారి SA20 ఫైనల్‌కు తమ నగరం ఆతిథ్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.
SA20 ఫైనల్‌ను మరోసారి నిర్వహించడం కేప్‌టౌన్‌కు గర్వకారణం. ఇదే ఏడాది జరిగే ICC పురుషుల వన్డే ప్రపంచకప్‌కు కూడా మా నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆటగాళ్లు, అభిమానులకు ఘన స్వాగతం పలికేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.