NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే 
    తదుపరి వార్తా కథనం
    World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే 

    World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే 

    వ్రాసిన వారు Stalin
    Nov 19, 2023
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది.

    ఈ ఫినాలేలో టీమిండియా గెలవాలని కోట్ల మంది భారతీయలు ఆశపడుతున్నారు.

    1983, 2011 నాటి ప్రపంచ కప్ ఫలితాలు మళ్లీ పునరావృతం కావాలని కోరుకుంటున్నారు.

    ఈ ప్రతిష్టాత్మ మ్యాచ్‌ను వీక్షించేందుకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ఇంతకీ ఆ అతిథులు ఎవరో తెలుసుకుందాం.

    ఈ మ్యా‌చ్‌కు హాజరయ్యే వీవీఐపీల జాబితాలో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఉన్నారు.

    కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఇండియాలోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి ఉన్నారు.

    వరల్డ్ కప్

    కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ హాజరు

    1983, 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత కెప్టెన్లు, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ ఇద్దరూ స్టేడియంలో భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు మ్యాచ్‌కు హాజరవుతారు.

    ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్, ఇంగ్లండ్‌ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ కూడా ఫైనల్స్‌కు వచ్చారు.

    ఫైనల్ సందర్భంగా బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టాస్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 1:30గంటలకు ఐఎఎఫ్ సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం ఎయిర్ షో నిర్వహించనుంది.

    మ్యాచ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం సంగీత మాంత్రికుడు ప్రీతమ్, గాయకులు జోనితా గాంధీ, నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, అకాసా సింగ్, తుషార్ జోషిలనలు ఏర్పాట్లు చేశారు.

    సెకండ్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో ప్రత్యేక లేజర్, లైట్ షోను ఏర్పాటు చేశారు.

    కప్

    భద్రత కట్టుదిట్టం

    ఫినాలే మ్యాచ్ కోసం దాదాపు 6,000 మంది పోలీసులను మోహరించారు. దాదాపు 3,000 మంది స్టేడియం లోపల ఉన్నారు. మిగిలిన వారు ఇతర కీలకమైన ప్రదేశాలలో కాపలాగా ఉన్నారు.

    ఇన్‌స్పెక్టర్-జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్-జనరల్ ర్యాంక్‌కు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్, 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

    ఐఏఎఫ్ ప్రదర్శన ఉన్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం గగనతలాన్ని మధ్యాహ్నం 1:25 నుండి 2:10 గంటల వరకు మూసి వేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ కప్
    టీమిండియా
    ఆస్ట్రేలియా
    అహ్మదాబాద్

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    ప్రపంచ కప్

    ప్రపంచకప్ పిచ్‌ల‌పై ఐసీసీ స్పెషల్ ఫోకస్.. పచ్చిక పెంచాలంటూ క్యూరెట‌ర్లకు మార్గదర్శకాలు జారీE క్రికెట్
    క్రికెట్ ప్రేమికులకు డబుల్ దమాకా.. వన్డే ప్రపంచకప్‌ అధికారిక పాటను చూసేయండి క్రికెట్
    నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ టీమిండియా
    World Cup 2023 : ప్రపంచకప్ లో పాకిస్థాన్ బోణి.. నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన పాక్ క్రికెట్

    టీమిండియా

    IND Vs SL: భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్  శ్రీలంక
    Rohit Sharma : రివ్యూలపై నిర్ణయాన్ని కీపర్, బౌలర్లకే వదిలేశా : రోహిత్ శర్మ రోహిత్ శర్మ
    Shreyas Iyer: మీడియాపై అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్.. అంత కోపమెందుకో..? శ్రేయస్ అయ్యర్
    Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం  ప్రపంచ కప్

    ఆస్ట్రేలియా

    IND vs AUS: రేపు భారత్‌తో వన్డే మ్యాచ్.. ఆసీస్‌కు భారీ షాక్ టీమిండియా
    కంగారులతో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్.. భారత్‌పై ఆసీస్‌దే ఆధిపత్యం! టీమిండియా
    IND Vs AUS : ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?  టీమిండియా
    హాఫ్ సెంచరీతో రఫ్పాడించిన రాహుల్, సూర్య  తొలి వన్డేలో  టీమిండియా ఘన విజయం టీమిండియా

    అహ్మదాబాద్

    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025