
గ్రీన్ సూపర్ సెంచరీ.. హైదరాబాద్ పై గెలిచిన ముంబై
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
ఐపీఎల్ లో చరిత్రలో సన్ రైజర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై మొదటిసారిగా భారీ స్కోరును నమోదు చేసింది.
సన్ రైజర్స్ బ్యాటర్లలో వివ్రంత్ శర్మ 47 బంతుల్లో 69 పరుగులు, మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 83 పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు భారీ స్కోరును అందించారు.
ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ 4 వికెట్లతో విజృంభించాడు.
Details
హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. రెండో ఓవర్లలో ఇషాన్ కిషాన్ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్, రోహిత్ శర్మతో జత కట్టి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
కామెరూన్ గ్రీన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు, రోహిత్ శర్మ 37 బంతుల్లో 56 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ కి విజయాన్ని అందించారు.
ఇక చివర్లో సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 25 పరుగులు చేసి విజృంభించాడు.
ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే ఆర్సీబీ, గుజరాత్ మ్యాచ్ ఫలితంపై ముంబై ఫ్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నారు.