Harbhajan- Dhoni: 'మా ఇద్దరికీ మాటలు లేవు'.. హర్భజన్‌సింగ్ షాకింగ్ కామెంట్స్
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, ధోనీకి మధ్య మాటలు లేవని, వారిద్దరూ స్నేహితులు కాదని చెప్పారు. 2018-2020 కాలంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడినప్పుడు కూడా మైదానంలో మాత్రమే పరిమితంగా మాట్లాడుకున్నామన్నారు.
ధోనీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు
"నేను ధోనీతో చాలా కాలం మాట్లాడలేదు.మా మధ్య మాటలేక దశాబ్దం దాటిపోయింది. నాకు, అతనితో ఎలాంటి సమస్య లేదు.కాని అతనే మాట్లాడటం లేదు,ఎందుకు అనేది నాకు తెలీదు.నేను సీఎస్కే తరఫున ఆడినప్పుడు,మేము మాట్లాడినప్పుడు అది కేవలం మైదానం వరకే పరిమితం.అతను నా గదిలోకి రాలేదు,నేను అతని గదిలోకి వెళ్లలేదు.ధోనీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. అతను ఏదైనా చెప్పాలని భావిస్తే,నాకు చెప్పగలడు.అయితే, ఏదైనా ఉండి ఉంటే,అదే సమయంలో చెప్పేవాడు. నేను ధోనీకి ఫోన్ చేయను. నా ఫోన్ కాల్స్‌కి ఎవరైతే స్పందిస్తారో వారికే చేస్తాను.స్నేహితులతోనే సంబంధం ఉంటుంది.ఈ సంబంధం పరస్పర గౌరవంపై ఆధారపడుతుంది.
సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో చివరిగా కలిసి ఆడారు
మనం ఎదుటివారిని గౌరవిస్తే, వారు కూడా మనల్ని గౌరవిస్తారు. కానీ, ఎవరికి అయినా 10 సార్లు ఫోన్ చేసి కూడా స్పందన లేకపోతే, వారిని కేవలం అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తాను," అని హర్భజన్ చెప్పారు. ధోనీ కెప్టెన్సీలో భారత దేశం 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు టోర్నీల్లో హర్భజన్ భారత్ తరఫున ఆడాడు. వీరిద్దరూ 2015లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో చివరిగా కలిసి ఆడారు. ఆ మ్యాచ్‌లో హర్భజన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 70 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. అయితే, భారత్ 214 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.