Loading...
Hardik Pandya: అఫ్గాన్‌ సిరీస్‌కు హార్దిక్, నితీశ్‌.. టీమిండియాలోకి స్టార్ ఆల్‌రౌండర్ల రీఎంట్రీ!
అఫ్గాన్‌ సిరీస్‌కు హార్దిక్, నితీశ్‌.. టీమిండియాలోకి స్టార్ ఆల్‌రౌండర్ల రీఎంట్రీ!

Hardik Pandya: అఫ్గాన్‌ సిరీస్‌కు హార్దిక్, నితీశ్‌.. టీమిండియాలోకి స్టార్ ఆల్‌రౌండర్ల రీఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, నితీశ్‌కుమార్‌ రెడ్డి త్వరలోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్‌తో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు వీరిద్దరూ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌ కోసం మరికొన్ని రోజుల్లో భారత జట్టును ఎంపిక చేయనున్నారు. తొడ కండరాల గాయంతో గత కొన్ని నెలలుగా బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఉంటున్న హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం. ఇదే సమయంలో గాయాల నుంచి కోలుకున్న మరో ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వివరాలు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ

'హార్దిక్‌, నితీశ్‌కుమార్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో చాలా కాలంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఇద్దరూ ఫిట్‌నెస్‌ సాధించారు.

వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల హార్దిక్‌, నితీశ్‌ తమ ఇళ్లకు వెళ్లారని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

మరోవైపు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లోనే ఫిట్‌నెస్‌ సాధిస్తున్న భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడటం అనుమానంగా మారింది. ఈ నెల 19నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో బుమ్రా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఈ నెల 13న ప్రారంభం కానుండగా.. త్వరలోనే భారత జట్టును ప్రకటించనున్నారు.

హార్దిక్‌, నితీశ్‌కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఫిట్‌గా ఉండటం భారత జట్టుకు కీలక బలంగా మారనుంది.

ADVERTISEMENT