LOADING...
WPL 2026: హర్లీన్ హాఫ్ సెంచరీ.. యూపీ ఖాతాలో తొలి విజయం
హర్లీన్ హాఫ్ సెంచరీ.. యూపీ ఖాతాలో తొలి విజయం

WPL 2026: హర్లీన్ హాఫ్ సెంచరీ.. యూపీ ఖాతాలో తొలి విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన యూపీ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను విజయవంతంగా సాధించింది. యూపీ బ్యాటింగ్‌లో హర్లీన్‌ డియోల్‌ చెలరేగారు. 39 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఆమె జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జార్జియా లిచ్‌ఫీల్డ్‌ 22బంతుల్లో 25 పరుగులు, మెగ్‌ లానింగ్‌ 26 బంతుల్లో 25 పరుగులు చేశారు. కిరణ్‌ నవ్‌గిరే 12 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగా, ట్రయాన్‌ 11 బంతుల్లో 27పరుగులతో చివర్లో వేగంగా ఆడి జట్టును గమ్యానికి చేర్చారు.

Details

 రాణించిన బ్రంట్

ముంబయి బౌలర్లలో అమీలియా కేర్‌ ఒక వికెట్‌, బ్రంట్‌ రెండు వికెట్లు పడగొట్టారు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన యూపీకి ఇది టోర్నీలో తొలి విజయం కావడం విశేషం. అంతకు ముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. బ్రంట్‌ 65 పరుగులతో అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నారు. అమన్‌జ్యోత్‌ 38 పరుగులు, కేరీ 32 పరుగులతో అజేయంగా నిలిచారు. అయితే కమిలిని 5, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ 16, సజన కేవలం 1 పరుగుకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో శిఖ, దీప్తి, సోఫీ, ఆశ తలో వికెట్‌ పడగొట్టి ముంబయి పరుగులను కట్టడి చేశారు.

Advertisement