'టీమిండియా ఓపెనర్‌గా అతనే దమ్మునోడు' : గంభీర్
టీమిండియా ఓపెనర్‌గా యువ ప్లేయర్ ఇషాన్ కిషనే దమ్మున ప్లేయర్ అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు సన్నదమవుతున్న టీమిండియా.. ఇషాన్ కిషన్‌నే తమ ప్రధాన ఓపెనర్‌గా ఎంచుకోవాలి. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీ చేసి విమర్శకుల నోర్లకు ఇషాన్ మూయించాడని పేర్కొన్నారు. టీ20ల్లో రోహిత్ జోడిగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ కొనసాగారు. ప్రస్తుతం వాళ్లు ఫామ్‌లో లేనందను ఇషాన్ కిషాన్ డిమాండ్ ఎక్కువైంది. ప్రస్తుతం దీనిపై భారత మాజీ ఓపెనర్ గంభీర్ మాట్లాడారు. తనవరకైతే అసలు ఈ చర్చే అవసరం లేదని, వన్డేల్లో కూడా ఇషాన్ కిషన్ రోహిత్ కు జోడీగా రావాలని అభిప్రాయపడ్డారు.
బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు
'ఇషాన్ కిషన్ ఇటీవలే బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. కానీ ఇషాన్ మాత్రం మూడో వన్డేలో 35వ ఓవర్లోనే డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇషాన్ ఓపెనర్ బ్యాటర్ గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా సేవలందించే అవకాశముంది, కిషాన్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఓపెనింగ్ జోడీ గురించి చర్చ అనవసరం అనిపిస్తోంది.'అని గంభీర్ తెలిపాడు. రోహిత్ - ఇషాన్‌లు ఓపెనింగ్ స్థానంలో ఉండాలి విరాట్ కోహ్లీ మూడో , నాలుగో స్థానంలో సూర్య, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఆరో స్థానంలో హార్ధిక్ పాండ్యా ఆడాలని వివరించారు.