NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!
    అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!

    Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 15, 2024
    10:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్ 2024 అక్టోబర్ 18న ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 దేశాల ఏ జట్లు పాల్గొంటున్నాయి.

    టోర్నీ గ్రూప్ దశ మరింత ఆసక్తికరంగా మారనుంది. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక జట్లు ఉండగా, గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు పోటీపడనున్నాయి.

    ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌ చేరుకుంటాయి. సెమీస్‌ అక్టోబర్ 25న, ఫైనల్‌ అక్టోబర్ 27న జరగనున్నాయి.

    Details

    జట్టును ప్రకటించిన బీసీసీఐ

    భారత్-ఏ జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు తిలక్ వర్మకు అప్పగిస్తూ, బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

    తిలక్ వర్మతో పాటు ఐపీఎల్‌ స్టార్స్‌ అయిన అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, వైభవ్ అరోరా, సాయి కిశోర్‌ జట్టులో ఉన్నారు.

    భారత్ తొలి మ్యాచ్‌ అక్టోబర్ 19న పాకిస్థాన్‌తో జరగనుంది. తర్వాతి మ్యాచులు అక్టోబర్ 21న యూఏఈతో, అక్టోబర్ 23న ఒమన్‌తో జరుగుతాయి.

    భారత్ మ్యాచులు సాయంత్రం 5.30కి ఆరంభం కానున్నాయి.

    Details

    భారత్ తలపడే జట్లు ఇవే

    ఆసియా కప్‌కు భారత్-ఏ జట్టు

    తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చహర్.

    షెడ్యూల్ ఇదే

    అక్టోబర్ 19: భారత్ vs పాకిస్థాన్

    అక్టోబర్ 21: భారత్ vs యూఏఈ

    అక్టోబర్ 23: భారత్ vs ఒమన్

    అక్టోబర్ 25: సెమీఫైనల్-1, సెమీఫైనల్-2

    అక్టోబర్ 27: ఫైనల్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    పాకిస్థాన్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    టీమిండియా

    MS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. ఆ రోజు వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు : బద్రీనాథ్ ఎంఎస్ ధోని
    Surya Kumar Yadav: హ్యాపీ బర్తడే 'SKY'.. సూర్యకుమార్ యాదవ్ టాప్ రికార్డులివే! సూర్యకుమార్ యాదవ్
    Ravichandran Ashwin: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్‌ రవిచంద్రన్ అశ్విన్
    Team India: రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌! రిషబ్ పంత్

    పాకిస్థాన్

    Pakistan: ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా పౌరులు సహా 6 మంది మృతి అంతర్జాతీయం
    Pakistan: పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?  క్రీడలు
    Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య ఉగ్రవాదులు
    Pakistan : పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 71 మంది మృతి , 67 మందికి గాయలు  భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025