జనవరి 13న హాకీ ప్రపంచ కప్
పురుషుల హాకీ ప్రపంచ కప్ 15వ ఎడిషన్ జనవరి 13-29 వరకు ఇండియాలో జరగనుంది. ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చివరిసారిగా 1975లో భారత్ ట్రోఫిని గెలుచుకున్న విషయం తెలిసిందే. అర్జెంటీనా జనవరి 13న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. క్వార్టర్ ఫైనల్స్ జనవరి 24-25 తేదీల్లో జరగనున్నాయి. సెమీ ఫైనల్స్ జనవరి 27న జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జనవరి 29న భువనేశ్వర్‌లో జరుగుతుంది. పూల్ A: ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్ మరియు దక్షిణాఫ్రికా పూల్ B: బెల్జియం, జర్మనీ, దక్షిణ కొరియా మరియు జపాన్ పూల్ C: నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేషియా మరియు చిలీ పూల్ D: భారతదేశం, ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్ మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి
నాలుగోసారి అతిథ్యమివ్వడం నాలుగోసారి
గ్రూప్ విజేతలు వెంటనే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. ప్రతి పూల్ నుండి రెండవ, మూడవ స్థానాల్లో ఉన్న జట్లు క్రాస్ ఓవర్లలో పోటీపడతాయి. అక్కడి నుంచి మరో నాలుగు జట్లు క్వార్టర్-ఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్ చివరిసారిగా 1975లో టోర్నీని గెలుచుకుంది, 1973, 1971లో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచింది. 2018 టీమిండియా ఆరో స్థానంలో నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడం ద్వారా 41 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 1982 ముంబై, 2010 ఢిల్లీ, 2018 ఒడిశా తర్వాత భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. ఒక దేశం హాకీ ప్రపంచకప్‌కు అత్యధిక సార్లు ఆతిథ్యమిచ్చిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది.