LOADING...
Tilak Varma: చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్లు ముందు దేశమే కనిపించింది
చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్లు ముందు దేశమే కనిపించింది

Tilak Varma: చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్లు ముందు దేశమే కనిపించింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు గెలుపు అందించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జట్టు సభ్యులతో కలిసి చేసిన కృషిని గుర్తు చేశారు. ఫైనల్‌లో జట్టు గెలుపు సాధించాలనే లక్ష్యంతోనే ఆడానని, చాలా ఒత్తిడిలోనూ తన ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశానని తిలక్ వర్మ తెలిపారు. టోర్నీలో జట్టు సమష్టిగా కష్టపడ్డిందని, చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగిందని కూడా పేర్కొన్నారు. ఓటమి తీరాలుగా వెళ్తున్న మ్యాచ్‌లో తానే గెలుపు బాటలు వేశానని తెలిపారు. ఫైనల్‌లో తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

Details

జట్టు కోసం కష్టపడినందుకు గర్వంగా ఉంది

ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో ప్రదర్శించిన వీరోచిత పోరాటంతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటుకున్నారు. యూఏఈ నుంచి హైదరాబాద్ చేరుకున్న తిలక్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ అధికారులు, ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. తరువాత లింగంపల్లిలోని లేగల్ గ్రౌండ్‌లో శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. మీడియాతో మాట్లాడుతూ తిలక్ వర్మ, ఆసియా కప్ ఫైనల్‌లోని ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, జట్టు కోసం కష్టపడ్డందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

Details

'ఆపరేషన్ తిలక్ వర్మ' అని పిలవడం సంతోషానిచ్చింది

పాకిస్థాన్‌ ప్లేయర్స్ ఒత్తిడికి గురి చేసినప్పటికీ పట్టించుకోకపోవడం, మ్యాచ్ గెలిచి ధీటుగా బదులివ్వాలనే ఆలోచనలో ఉండటం కూడా తెలిపారు. వ్యూహాల మార్పులు, ప్రతి మ్యాచ్‌లో జట్టు కృషి విజయానికి కారణమని పేర్కొన్న తిలక్ వర్మ, తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాగే విరాట్ కోహ్లీ నుంచి పొందిన స్ఫూర్తి, జట్టులో అద్భుతమైన బౌలర్ల కృషి ప్రేరణనిచ్చిందని వివరించారు. తిలక్ వర్మ, "ఆపరేషన్ తిలక్ వర్మ" అని దేశమంతా పిలుస్తుండటం గర్వంగా ఉందని భావోద్వేగంతో తెలిపారు.