Ambati Rayudu: శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు చేసేవారిని చూస్తే నవ్వొస్తోంది: అంబటి రాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన భారత జట్టు.. చివరి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అంతకుముందు జరిగిన నాలుగు టీ20ల్లోనూ దూకుడుగా ఆడినప్పటికీ.. భారీ ఇన్నింగ్స్‌లు నమోదు చేయలేకపోయాడు. దీంతో అతడి బ్యాటింగ్‌పై పలువురు విమర్శలు గుప్పించారు. అయితే, ఈ విమర్శలను మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొట్టిపారేశాడు. శ్రేయస్ ఆటతీరును అంచనా వేయాలంటే అతడి స్ట్రైక్‌రేట్‌ను కూడా పరిశీలించాలని సూచించాడు.
వివరాలు
శ్రేయస్ అద్భుతమైన బ్యాటర్: అంబటి రాయుడు
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. అతడి ఆటపై విమర్శలు చేసేవారిని చూస్తే నవ్వొస్తోందని వ్యాఖ్యానించాడు.
శ్రేయస్ ఎప్పుడు మైదానంలోకి దిగినా మ్యాచ్ విన్నర్‌గా నిలవగలడని పేర్కొన్నాడు. ''శ్రేయస్ అయ్యర్ ఆటపై కామెంట్లు చేసేవారిని చూస్తే నాకు నవ్వొస్తోంది.
ఎప్పుడు మైదానంలోకి దిగినా మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను అతడు సమర్థంగా ఎదుర్కొంటాడు.
ఇన్నింగ్స్‌లో తడబడుతూ.. అప్పుడప్పుడు బౌండరీలు కొట్టి పరుగులు సాధించే ఆటగాడు కాదు. ఒకసారి క్రీజులో కుదురుకున్నాడంటే పూర్తి ఆధిపత్యం చలాయిస్తాడు. ఎప్పుడు గేర్లు మార్చాలో అతడికి బాగా తెలుసు.
నాలుగు, ఐదో టీ20ల్లో అతడి స్ట్రైక్‌రేట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుందని అంబటి రాయుడు తెలిపాడు.
వివరాలు
దూబేను బెంచ్‌పై ఉంచడం సరికాదు: ఆకాశ్ చోప్రా
మరోవైపు, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శివమ్ దూబేకు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం కల్పించకపోవడంపై మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
దూబేను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. తుది జట్టులో చోటు కల్పించకపోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. ''దూబే ఆసియా గేమ్స్ ఫైనల్‌లో ఆడాడు.
అక్కడ అద్భుతంగా పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌తో వన్డే క్రికెట్ కూడా ఆడాడు. అయినప్పటికీ, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదు.
నితీశ్ కుమార్ మంచి బౌలర్ కమ్ ఆల్‌రౌండరే కావచ్చు. కానీ, దూబే మంచి ఫినిషర్. ఒక ఆటగాడిని ఎంపిక చేయడానికి ఇంతకంటే ఏం కావాలి?'' అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.