Page Loader
Umesh Yadav: టీమిండియా జెర్సీ మరోసారి ధరించాలని ఉంది : ఉమేశ్ యాదవ్
టీమిండియా జెర్సీ మరోసారి ధరించాలని ఉంది : ఉమేశ్ యాదవ్

Umesh Yadav: టీమిండియా జెర్సీ మరోసారి ధరించాలని ఉంది : ఉమేశ్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) మరోసారి జాతీయ జట్టులోకి ప్రవేశించాలన్న ఆతృతతో కృషి చేస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశవాళీ క్రికెట్‌లో తిరిగి మంచి ప్రదర్శన కనబరిచి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించాడు. 'నన్ను నేను ఎంపిక చేసుకోలేను కదా' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం 37 ఏళ్ల వయస్సున్న ఉమేశ్ యాదవ్, భారత్ తరఫున చివరిసారిగా 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 40 ఓవర్లు బౌలింగ్ చేసి 131 పరుగులు ఇవ్వగా కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

Details

ఎక్కడా శిక్షణా పొందలేదు

అప్పటి నుంచి గాయాల కారణంగా, అలాగే యువ బౌలర్లు బలంగా జట్టులోకి రావడంతో ఆయనకు తిరిగి జట్టులో స్థానం లభించలేదు. ఈ నేపథ్యంలో ఉమేశ్ మాట్లాడుతూ, 'టీమ్ ఇండియాలోకి తిరిగి రావాలన్నదే నా లక్ష్యం. పొట్టి క్రికెట్ ఆడి, ఫిట్‌నెస్‌తో సిద్ధమై జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని చూస్తున్నా. కానీ నన్ను నేనే ఎంపిక చేసుకోలేను కదా. నేను క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పుడు భారత్ తరఫున ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు. నేనొక సహజ ఫాస్ట్ బౌలర్‌ని. చిన్నప్పటి నుంచే వేగంగా బౌలింగ్ చేసేవాణ్ని. ఎప్పుడూ ఏ అకాడమీకి వెళ్లి శిక్షణ పొందలేదు.

Details

భారత్ తరుపున 75 వన్డేలు ఆడిన ఉమేష్

ఎవరైనా చెప్పిన తర్వాతే చిన్న చిన్న టోర్నీల్లో ఆడటం మొదలుపెట్టా. ఈ విధంగా ఒక బొగ్గుగని కార్మికుడి కుమారుడు ఇండియా తరఫున ఆడగలిగాడు. జీవితంలో జరగాల్సినవి జరుగుతాయి. ఫాస్ట్ బౌలర్లు సహజంగా ఉంటారని నేను ఎప్పుడూ నమ్ముతానని చెప్పారు. అంతేకాదు, ఉమేశ్ యాదవ్ ఇప్పటివరకు భారత తరఫున 57 టెస్టుల్లో 170 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు తీశాడు. తన అనుభవం, పట్టుదలతో మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించే ఆశతో ఉమేశ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.