LOADING...
T20 World Cup Semi-Final: ఐసీసీ షెడ్యూల్ షాక్… భారత్ సెమీస్ వేదిక మారిందా?
ఐసీసీ షెడ్యూల్ షాక్… భారత్ సెమీస్ వేదిక మారిందా?

T20 World Cup Semi-Final: ఐసీసీ షెడ్యూల్ షాక్… భారత్ సెమీస్ వేదిక మారిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 రౌండ్ మొదలయింది. రెండు గ్రూపుల్లో టాప్-2 స్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌లోకి వెళ్తాయి. షెడ్యూల్ ప్రకారం, భారత్ సెమీస్‌ ఆడితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత్ తన సెమీఫైనల్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో ఆడే అవకాశముంది. భారత్ ఎక్కడ ఆడాలనేది పాకిస్తాన్‌పై ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్‌తో సెమీస్‌ జరుగితే, మ్యాచ్ కొలంబోలోని స్టేడియంలో ఫిక్స్ అవుతుంది. భారత్, శ్రీలంక కలిపి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వర్తిస్తున్నాయి. పాకిస్తాన్ తన మ్యాచులను పూర్తిగా శ్రీలంకలో ఆడుతుంది.

Details

పాకిస్థాన్ తో ఆడితే మ్యాచ్ కొలంబోలో

భారత్ సూపర్-8లో మొదటిస్థానంలో, పాక్ రెండో స్థానంలో ఉన్నా, లేదా భారత్ రెండో స్థానంలో, పాక్ మొదటిస్థానంలో ఉన్నా, ఇరు జట్లు సెమీస్‌లో తలపడతాయి. అప్పుడు మార్చి 5న ముంబైలో జరగాల్సిన సెమీఫైనల్, మార్చి 4న కొలంబోలో జరుగుతుంది. తేదీ మార్పుకు కారణం భారత్‌లో మార్చి 4న హోలీ పండగ ఉండడం. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం, "భారత్-పాకిస్తాన్ సెమీస్‌ అయితే, మ్యాచ్ కొలంబోలో, పాకిస్తాన్ కాకుండా వేరే టీమ్‌తో భారత్ సెమీస్‌ ఆడితే, ముంబైలో జరుగుతుందని స్పష్టంగా నిర్ణయించారు.

Advertisement