Page Loader
జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం
ఎడమచేతి వాటం పేసర్లు టీమిండియాకు అవసరమన్న రాహుల్ ద్రవిడ్

జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2023
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో లెట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తారు. టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటంది. టీమిండియాకు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ విభాగంలో ఒకప్పుడు జహీర్‌ఖాన్ కొత్త చరిత్రలను సృష్టించాడు. ప్రస్తుతం ఆలాంటి బౌలర్ కోసం టీమిండియా అన్వేషిస్తోంది. గతంలో జహీర్ ఖాన్, ఆశిశ్ నెహ్రా, ఆర్సీసింగ్, ఇర్ఫాన్ ఫఠాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్‌లో అద్భుతాలను సృష్టించారు. ఇటీవల ఎడమచేతి ఫాస్ట్ బౌలర్లు భారత జట్టులో కుదురుకున్న సందర్భాలు చాలా తక్కువ. శుక్రవారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ మీట్ లో ఎడమచేతి వాటం బౌలర్లు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

రాహుల్ ద్రవిడ్

ఆర్షదీప్ సింగ్ ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు

లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జట్టులో ఉంటే బౌలింగ్‌లో వేరియేషన్స్ తీసుకొస్తామని, ఇప్పుడంతా షాహీన్, స్టార్క్ పేర్లు చెబుతున్నారని, అయితే జహీర్ ఖాన్ బౌలర్‌ని అంతా మరిచిపోయారని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. ఆర్షదీప్ సింగ్ ఇటీవల టీ20లు, వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నాడని, ఇప్పుడిప్పుడే అర్షదీప్ ఎదుగుతున్నాడని, ఇలాంటి యంగ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల కోసం తాము వెతుకుతున్నామని రాహుల్ ద్రవిడ్ చెప్పారు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయినంత మాత్రాన జట్టులో స్థానం దక్కదని, మెరుగైన ప్రదర్శన చేస్తేనే జాతీయ జట్టులోకి తీసుకుంటామని, 6 అడుగుల 4 అంగుళాల పొడవైన బౌలర్లు అరుదుగా కనిపిస్తారని, అలాంటి బౌలర్ దొరికితే తనకు తెలియజేయాలని జర్నలిస్టులకు రాహుల్ వివరించారు.