ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిటెనెస్ నిరూపించేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ కొత్త వివాదానికి తెర లేపాడు. జీన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ వ్యవహారంపై చేతన శర్మ నోరు జారాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
ఇటీవల ఛీప్ సెలక్టర్‌గా చేతన్ మరోమారు అవకాశం దక్కించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా వైఫల్యం నేపథ్యంలో కమిటీలోని సభ్యులందరినీ తప్పించి, చైర్మన్ అయిన చేతన్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
బీసీసీఐ
చేతన్ శర్మపై వేటుపడే అవకాశం
రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా తనను గుడ్డిగా నమ్ముతారని, టీ20ల్లో రోహిత్ కెరీర్ ముగిసిందని చేతన్ శర్మ చెప్పారు.
భారత్ క్రికెటర్లు 80శాతం ఫిట్ ఉన్నా సరే, ఇంజక్షన్లు తీసుకొని 100శాతం ఫిట్ నెస్ సాధిస్తారని డోప్ టెస్టులో అది పట్టుబడదని చేతన్ పేర్కొన్నారు. అయితే సరైన ప్రదర్శన చేయలేని కొందరు ఆటగాళ్లుకూడా ఈ ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
కోహ్లీని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలన్న నిర్ణయం గంగూలీ నిర్ణయం కాదని, ఉమ్మడిగా తామంతా తీసుకున్న నిర్ణయమని, టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలిగినప్పుడు మరోసారి ఆలోచించుకోవాలని గంగూలీ, కోహ్లీకి సూచించాడని చేతన్ వివరించాడు.
ఈ వ్యాఖ్యలపై బోర్డు పెద్దలు మౌనం వహిస్తున్నప్పటికీ.. చేతనపై వేటు పడడం ఖాయమని తెలుస్తోంది.