రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. రోహిత్‌శర్మ, విరాట్ లేకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ టీమిండియా దారుణంగా విఫలమైంది. రెండో టీ20 రేపు లక్నోలో జరగనుంది. తొలి టీ20లో 21 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంలో ఉంది. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో ఆదివారం రెండో టీ20 జరగనుంది.ఈ స్టేడియంలో ఎనిమిది టీ20 మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో రాత్రి ఏడు గంటలకు ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు
భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకూ 23 టీ20ల్లో తలపడ్డాయి. 12 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా.. 10 మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ టైం అయింది. న్యూజిలాండ్ చివరిగా 2019లో భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక T20I సిరీస్‌ను గెలుచుకుంది. తొలి టీ20 లో భారత్ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత్ : ఇషాన్‌కిషన్, శుభ్‌మన్, రాహుల్‌త్రిపాఠి, సూర్యకుమార్, హార్దిక్‌పాండ్యా (కెప్టెన్), దీపక్‌హుడా, వాషింగ్టన్‌సుందర్, శివమ్‌మావి, కుల్దీప్‌యాదవ్, ఉమ్రాన్‌మాలిక్, అర్ష్‌దీప్‌సింగ్ న్యూజిలాండ్ : ఫిన్‌అలెన్, డెవాన్‌కాన్వే (వికెట్ కీపర్), మార్క్‌చాప్‌మన్, డారిల్‌మిచెల్, గ్లెన్‌ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), బ్రేస్‌వెల్, జాకబ్‌డఫీ, ఇష్‌సోధీ, ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్