Page Loader
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సై
ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్న హార్దిక్ పాండ్యా

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సై

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2023
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. నేడు టీ20 సమరానికి సిద్ధమైంది. రోహిత్‌శర్మ, కోహ్లీ, కెఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా.. హర్ధిక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్‌ ఉంది. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, టీ20ల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ జట్లు రెండుసార్లు గెలిచాయి. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. భారత్,న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటివరకు 22 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. NZ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఒకటి టై అయింది.

టీమిండియా

ఇరు జట్లలోని సభ్యులు

ముఖ్యంగా టీమిండియా, న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు లేరు. యువకులు తమదైన ముద్ర వేసుకోవడానికి ఈ టీ20 సిరీస్ ఉపయోగపడనుంది. మూడో వన్డేలో సెంచరీ చేసిన డెవాన్ కాన్వే ఇటీవల అద్భుతంగా రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. హార్దిక్ పాండ్య ఫామ్‌లోకి వస్తే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవు. భారత్ (ప్రాబబుల్ XI): శుభ్‌మన్‌గిల్, ఇషాన్‌కిషన్ (వికెట్ కీపర్), రాహుల్‌త్రిపాఠి, సూర్యకుమార్‌యాదవ్, హార్దిక్‌పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్‌సుందర్, అర్ష్‌దీప్‌సింగ్, ఉమ్రాన్‌మాలిక్, చాహల్, కుల్దీప్ యాదవ్. న్యూజిలాండ్ (ప్రాబబుల్ XI): డెవాన్‌కాన్వే (వికెట్ కీపర్), ఫిన్‌అలెన్, మార్క్‌చాప్‌మన్, డారిల్‌మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, డేన్ క్లీవర్, మిచెల్ సాంట్నర్ (కెపైన్), ఇష్ సోధి, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్