India A Vs New Zealand A: పడిక్కల్ అర్ధ సెంచరీ.. న్యూజిలాండ్-ఏతో మ్యాచ్‌లో కోలుకుంటున్న భారత్-ఏ
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే ఆలౌటైన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే దేవ్‌దత్ పడిక్కల్, సాయి సుదర్శన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ అజేయంగా 96 పరుగులు జోడించారు. భారత్ స్టార్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), కేఎల్ రాహుల్ (4)రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచారు. దీంతో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను పడిక్కల్,సాయి సుదర్శన్ ఆదుకున్నారు. పడిక్కల్ 56 పరుగులతో అజేయ అర్ధ సెంచరీ సాధించగా.. సాయి సుదర్శన్ 39 పరుగులతో అతడికి అండగా నిలిచాడు.
వివరాలు
న్యూజిలాండ్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌట్
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించాలంటే భారత్ మరో 98 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు న్యూజిలాండ్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది.
ఆ జట్టు కెప్టెన్ మర్లు 76 పరుగులు చేయగా.. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 51 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు.
కర్టిస్ హీఫీ (44), క్రిస్టియన్ క్లార్క్ (42) కూడా బ్యాట్‌తో రాణించారు. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్, ఆకిబ్ నబీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఆకాశ్‌దీప్ రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ సాధించారు.
వివరాలు
తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్
భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
కేఎల్ రాహుల్‌తో పాటు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, ముకేశ్ చౌదరి పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు.
ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని స్పష్టం చేసింది.
యశ్ రాథోడ్ 44 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. పడిక్కల్ 32 పరుగులు చేశాడు.
యశస్వి జైస్వాల్ 17, అన్షుల్ కంబోజ్ 10, ఆకిబ్ నబీ 5, ధ్రువ్ జురెల్ ఒక పరుగు మాత్రమే సాధించారు.
న్యూజిలాండ్-ఏ బౌలర్లలో సైమన్ కీన్ ఐదు వికెట్లతో భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.
వివరాలు
జాక్ గిబ్సన్ మూడు వికెట్లు
జాక్ గిబ్సన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేసర్ షీట్, క్రిస్టియన్ క్లార్క్ చెరో వికెట్ తీశారు.
కాగా, మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-ఏ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది.
తొలి మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి కోలుకుని, రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంపై భారత జట్టు దృష్టి పెట్టింది.