WCL 2026 Semi-Finals: వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ సెమీస్‌కు నాలుగు జట్లు.. టోర్నీ నుంచి భారత్ ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
2026 వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టీ20 టోర్నీలో లీగ్ దశ ముగిసింది. సౌతాఫ్రికా చాంపియన్స్ అద్భుత ప్రదర్శనతో అజేయంగా సెమీఫైనల్‌కు చేరుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆ జట్టు.. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు,యువరాజ్ సింగ్ నాయకత్వంలోని ఇండియా చాంపియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా భారీ విజయం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్ 88పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చాంపియన్స్‌ను ఓడించింది. ఈ పోరులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 210పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 211పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
వివరాలు
డుమిని అజేయ అర్ధ శతకం
సౌతాఫ్రికా బ్యాటర్లలో జీన్ పాల్ డుమిని అద్భుతంగా ఆడాడు. 49 బంతుల్లో 89 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ప్రదర్శనకు అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మోర్నీ వాన్ విక్ 19 బంతుల్లో 30 పరుగులు చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ 25 బంతుల్లో అజేయంగా 40 పరుగులు సాధించాడు.
122 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు.
18.5 ఓవర్లలో 122 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
వివరాలు
ఐదు వికెట్లతో విల్జోయిన్ సత్తా
సౌతాఫ్రికా బౌలర్ హార్డస్ విల్జోయిన్ ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. రోబీ ఫ్రైలింక్ రెండు వికెట్లు సాధించాడు.
వెయినె పార్నెల్, షాన్ వాన్ బెర్గ్ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
వివరాలు
సెమీఫైనల్‌కు నాలుగు జట్లు.. భారత్ ఇంటికి
బంగ్లాదేశ్‌పై విజయంతో సౌతాఫ్రికా చాంపియన్స్ లీగ్ దశలో అజేయంగా నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ఆస్ట్రేలియా చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఐదేసి మ్యాచ్‌ల్లో మూడేసి విజయాలు సాధించి సెమీస్ బెర్తులు దక్కించుకున్నాయి.
ఇంగ్లండ్ చాంపియన్స్ ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి తదుపరి దశకు చేరుకుంది.
ఇక యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
బంగ్లాదేశ్ చాంపియన్స్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఆ జట్టు సైతం ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచి ఇంటిదారి పట్టింది.
దీంతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.