Ind vs Afg: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దక్కేనా?.. అఫ్గాన్‌తో భారత్ చివరి టీ20 నేడు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్గనిస్తాన్‌తో తొలి రెండు టీ20ల్లో సునాయాస విజయాలు సాధించిన టీమిండియా.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపై దృష్టి పెట్టింది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం చివరి టీ20 జరగనుంది. భారత జోరును అడ్డుకుని వైట్‌వాష్ నుంచి తప్పించుకోవడం అఫ్గానిస్థాన్‌కు కష్టంగానే కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థిని 160 పరుగులలోపే కట్టడి చేసింది. తొలి టీ20లో లక్ష్యాన్ని 14వ ఓవర్లోనే ఛేదించిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో మరో ఓవర్ ఎక్కువ సమయం తీసుకుంది. బ్యాటింగ్‌లోనూ భారత్‌కు ఇబ్బందులు ఎదురుకాలేదు.అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌ల్లోనూ ధాటిగా ఆడగా.. తొలి టీ20లో విఫలమైన సంజు శాంసన్ రెండో మ్యాచ్‌లో తన సత్తా చాటాడు.
వివరాలు
వైభవ్‌కు అవకాశం దక్కేనా?
తొలి రెండు మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి.. చివరి టీ20లోనైనా అవకాశం లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
అతడిని ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే.. సంజు శాంసన్, అభిషేక్ శర్మల్లో ఎవరిని పక్కన పెడతారన్నది చూడాలి.
సిరీస్ ఇప్పటికే భారత్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తుది జట్టులో మరికొన్ని మార్పులు జరిగే అవకాశముంది.
జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి యశ్ ఠాకూర్‌ను ఆడించొచ్చనే అంచనాలున్నాయి.
అలాగే నితీశ్‌కుమార్ రెడ్డి, శివమ్ దూబెల్లో ఒకరికి విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
వివరాలు
బౌలింగ్‌లో ఆ లోపం సరిదిద్దుకోవాలి
సిరీస్‌లో భారత బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ.. రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన దశలో బౌలర్లు చివరి వరకు ఒత్తిడి కొనసాగించలేకపోయారు.
ఫలితంగా అఫ్గాన్ అనుకున్నదానికంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. చివరి మ్యాచ్‌లో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉంది.
వివరాలు
వైట్‌వాష్ తప్పించుకోవడమే లక్ష్యంగా..
భారత్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్న అఫ్గానిస్థాన్.. చివరి మ్యాచ్‌లోనైనా పోరాట పటిమ చూపి వైట్‌వాష్‌ను తప్పించుకోవాలని చూస్తోంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటైన విధ్వంసక ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఈ మ్యాచ్‌లోనైనా రాణిస్తాడేమో చూడాలి.
అతడితో పాటు కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్, ఆల్‌రౌండర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటడం అఫ్గాన్ విజయావకాశాలకు కీలకం.