Womens T20 Asia Cup: మహిళల టీ20 ఆసియాకప్.. హాంకాంగ్‌తో భారత్ పోరు నేడు
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల టీ20 ఆసియాకప్‌లో భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. గ్రూప్-ఎలో భాగంగా గురువారం హాంకాంగ్‌తో తలపడనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటికే మూడుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలిచిన భారత్.. ప్రస్తుత టోర్నీలో థాయ్‌లాండ్‌పై విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో పసికూన జట్టుపై ఆశించిన స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది.
వివరాలు
బ్యాటింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సిన అవసరం..
ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సిన అవసరం కనిపిస్తోంది.
థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులతో నిలిచిన భారత్.. సులువుగా 200కు పైగా స్కోరు చేసేలా కనిపించింది.
కానీ ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. కేవలం 29 పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లను కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.
వివరాలు
నేడే పోరు..
హాంకాంగ్‌పై విజయం సాధించడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
అయితే ముందున్న పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు కీలక పోరులను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఇస్తున్న శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచాలి.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పరుగుల బాట పట్టాల్సి ఉంది. భారత బౌలింగ్ విభాగం మాత్రం పటిష్ఠంగా కనిపిస్తోంది.
స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి శర్మతో పాటు పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ జట్టుకు బలంగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో హాంకాంగ్.. భారత జట్టుకు ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.