IND vs WI Super 8: ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు అద్భుత రికార్డు.. కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరికేనా!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో మరో హై వోల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది. గ్రూప్-1 సూపర్ 8 దశలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు నేడు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లకు ఇది చావో రేవో మ్యాచ్‌లాంటిదే. ఈ పోరులో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్తే, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. బ్యాటింగ్ బలంగా ఉన్న భారత్, వెస్టిండీస్ మధ్య ఈ పోరు క్వార్టర్ ఫైనల్ తరహాలో ఉత్కంఠ రేపుతోంది. ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందో ఆసక్తికరంగా మారింది.
Details
ఈడెన్‌లో భారత్‌కు బలమైన రికార్డు
1983 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ అద్భుత రికార్డు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేదికపై జరిగిన ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ భారత్‌ను ఓడించలేదు. ముఖ్యంగా విండీస్‌తో ఆడిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈడెన్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈరోజు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2026లో ఇటలీపై స్కాట్లాండ్ 207 పరుగులు చేయడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ పెద్ద స్కోర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Details
బౌలింగ్ టీమిండియాకు సవాల్
ప్రస్తుతం భారత్‌కు ప్రధాన ఆందోళన బౌలింగ్ విభాగమే. బుమ్రా, అర్షదీప్ మినహా మిగతా బౌలర్లు అధిక రన్స్ ఇస్తున్నారు. సూపర్ 8 మ్యాచ్‌ల్లో హార్దిక్, వరుణ్, అక్షర్, దూబే ఖరీదైన బౌలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో బంతితో పుంజుకోవడం భారత్‌కు అత్యంత కీలకం.
Details
పటిష్టంగా విండీస్ బ్యాటింగ్
వెస్టిండీస్ టాపార్డర్‌లో బ్రెండన్ కింగ్, షై హోప్, షిమ్రాన్ హెట్‌మయర్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. హెట్‌మయర్ మూడో స్థానంలో ఆడడం జట్టుకు మరింత బలం ఇస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో రోవ్‌మన్ పావెల్, రోస్టన్ చేజ్, రూథర్‌ఫర్డ్ పరుగులు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాపై 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి షెపర్డ్ అర్ధశతకం సాధించడం విండీస్ బ్యాటింగ్ లోతును స్పష్టంగా చూపిస్తోంది. విండీస్ హిట్టర్లను కట్టడి చేయాలంటే భారత బౌలర్లు కష్టపడాల్సిందే. స్పిన్నర్లు ప్రభావం చూపడంలో ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో పేసర్లు బుమ్రా, అర్షదీప్ ఎలా రాణిస్తారన్నది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అంశంగా మారింది.