Page Loader
భారత్ 48 ఏళ్ల కల నెరవేరేనా..?
ఓడిశాలో నేటి నుండి ప్రారంభం కానున్న హాకీ ప్రపంచకప్

భారత్ 48 ఏళ్ల కల నెరవేరేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

హాకీ జట్టు అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలో పైనల్లో పాకిస్తాన్ ను ఓడించి 1975లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు సాధ్యం కాలేదు. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన జట్టు కనీసం సెమీఫైన్‌ల్‌కి కూడా చేరుకోలేదు. 2023 భారత్ హకీ ప్రపంచ కప్‌కు మన దేశమే అతిథ్యమిస్తోంది. నేటి నుంచి హాకీ ప్రపంచ‌కప్ ఓడిశాలో ప్రారంభకానుంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. అనంతరం భారత్, స్పెయిన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఒడిషాలోని భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజులు పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరగనున్నాయి.

హాకీ

స్పెయిన్‌తో తలపడే భారత్ జట్టు ఇదే

హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో ప్రస్తుతం జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంక్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1-4తో నిష్క్రమించినా ఆకట్టుకొనే ప్రదర్శన చేసింది. భారతదేశం: అభిషేక్, సురేందర్‌కుమార్, మన్‌ప్రీత్‌సింగ్, హార్దిక్‌సింగ్, జర్మన్‌ప్రీత్‌సింగ్, మన్‌దీప్‌సింగ్, హర్మన్‌ప్రీత్‌సింగ్(సి), లలిత్‌ఉపాధ్యాయ్, క్రిషన్‌పాఠక్, నీలంసంజీప్, పిఆర్‌శ్రీజేష్, నీలకంఠశర్మ, షంషేర్‌సింగ్, వరుణ్‌కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్, అమిత్ రోహిదాస్ (vc), వివేక్ సాగర్ ప్రసాద్, సుఖ్‌జీత్ సింగ్. స్పెయిన్: ఆండ్రియాస్‌రఫీ, అలెజాండ్రో‌అలోన్సో, సీజర్‌క్యూరియల్, జేవీ‌గిస్పెర్ట్, బోర్జాలకాల్లే, ల్వారోఇగ్లేసియాస్, ఇగ్నాసియోరోడ్ర్, ఎన్రిక్‌గొంజాలెజ్, గెరార్డ్‌క్లాప్స్, ఆండ్రియాస్‌రఫీ, జోర్డి‌బొనాస్ట్రే, జోక్విన్‌గార్నే, మార్పెక్‌పెయిన్, జోక్విన్ గార్నే, మార్పెన్, మార్క్ రీకాసెన్స్, పౌ కునిల్ మరియు మార్క్ విజ్కైనో