IND vs PAK: పాక్ పోరుకు భారత జట్టు ఫైనల్.. తుది జట్టులో ఒక్కరికి ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
2026 టీ20 ప్రపంచకప్‌లో తన రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండో గెలుపును నమోదు చేసింది. ఇక ఫిబ్రవరి 15 ఆదివారం జరగనున్న మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఎదుర్కొనుంది. ఈ హై వోల్టేజ్ పోరు కొలంబో వేదికగా జరగనుండగా, అక్కడి పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశముందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌పై చర్చలు ఊపందుకున్నాయి. స్టార్ స్పోర్ట్స్‌లో ఇండియా-నమీబియా మ్యాచ్ సందర్భంగా జరిగిన చర్చలో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు చేశాడు.
Details
కుల్దీప్‌కు అవకాశం ఇవ్వాలి
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పెద్దగా మార్పులు అవసరం లేదని, కేవలం ఒకే ఒక్క మార్పు చాలు అని అభిప్రాయపడ్డాడు. స్పిన్‌కు అనుకూలమైన కొలంబో పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని ఇర్ఫాన్ సూచించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడీ అత్యంత కీలకమని పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ పూర్తిగా ఫిట్‌గా లేకపోతే, దృఢమైన ఓపెనింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని అభిప్రాయపడ్డాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ మంచి ప్రదర్శన చేశాడని, భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సరే అతని ఆటలో పురోగతి కనిపించిందని చెప్పాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు బాదడం గమనార్హమని, ఆ ధైర్యవంతమైన బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.
Details
పాకిస్థాన్‌పై ఇర్ఫాన్ సూచించిన ప్లేయింగ్ ఎలెవన్
సంజు శాంసన్/అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్. స్పిన్ బలగాన్ని మరింత బలోపేతం చేస్తే పాకిస్థాన్‌పై భారత్‌కు ఆధిక్యం సాధ్యమని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.