IPL 2023: చివర్లో బౌండరీలు బాదడమే తన లక్ష్యం : ఎంఎస్ ధోని
ఐపీఎల్లో చైన్నైసూపర్ కింగ్స్ ప్లేఆప్స్ దిశగా ముందుకెళ్తుతోంది. తాజాగా ఢిల్లీని 27 పరుగుల తేడాతో చైన్నై ఓడించింది. ఈ మ్యాచ్లో ధోని 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. 41 ఏళ్ల ధోని యువకుడిలా మారి మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. గత సీజన్‌లో మొత్తంలో 10 సిక్సర్లు కొట్టిన ధోని, 2021లో 7 సిక్సర్లు, 2020లో కేవలం 3 సిక్సర్లలనే బాదాడు. దీన్ని బట్టి చూస్తే ధోనికి వయసు పెరిగే కొద్ది సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. మిస్టర్ కూల్ ప్రదర్శనపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఢిల్లీపై విజయం సాధించిన అనంతరం ధోని మాట్లాడారు. తాను చివర్లో ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నానని, ఎక్కువగా పరిగెత్తే అవకాశం ఇవ్వొద్దని తమ బ్యాటర్లకు ముందే చెప్పానని తెలియజేశారు.
రుతురాజ్ గైక్వాడ్ పై ధోని ప్రశంసలు
చైన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ను ధోని ప్రశంసించారు. రుతురాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, డెవాన్ కాన్వేతో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నాడని, పరిస్థితులకు తగ్గట్టు తన గేమ్ మార్చుకోవడం మంచి పద్ధతి అని, ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలని చెప్పారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చైన్నై నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ చేధించలేకపోయింది. కేవలం 140 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో రిలే రోసౌ(35), మనీష్ పాండే(27) మినహా మిగిలిన బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియానికి చేరారు. చెన్నై బౌలర్లలో మహీష పతిరాణా 3 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ 2 వికెట్లతో రాణించాడు